తెలంగాణలో 1.10 లక్షల పోస్టులు ఖాళీ

370

తెలంగాణలో మొత్తం 1.10 లక్షల ఖాళీలున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధ రిక్రూట్ మెంట్ ఏజెన్సీల ద్వారా ఇప్పటికే 54,724 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయగా అందులో 28,116 పోస్టుల భర్తీ పూర్తయింది. 1.10 లక్షల ఖాళీల్లో అత్యధికంగా హోంశాఖలో 36,785 పోస్టులుండగా వైద్య ఆరోగ్య శాఖలో 12,487, విద్యాశాఖలో 9,980 ఖాళీలున్నాయి.